We will kill the Punjab CM .. Sikh organization warns
mictv telugu

పంజాబ్ సీఎంను చంపేస్తాం.. సిక్కు సంస్థ హెచ్చరిక

June 6, 2022

We will kill the Punjab CM .. Sikh organization warns

పంజాబ్‌ రాష్ట్రంలో రోజు రోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా సీఎం భగ్‌వంత్‌ సింగ్‌ మాన్‌ను చంపేస్తాం అంటూ సిక్కు సంస్థ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. ”స్వర్ణ దేవాలయం నుంచి బలగాలను ఉపసంహరించాలి. ఖలిస్థానీ అనుకూల శక్తులకు వ్యతిరేకంగా నడుచుకోవడం ఆపేయాలి. లేకపోతే, మాజీ సీఎం బియాంత్‌ సింగ్‌కు పట్టిన గతే మీకూ పడుతుంది. మా హెచ్చరికలను బేఖాతరు చేస్తే జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి” అంటూ అని ఎస్‌ఎఫ్‌జే చీఫ్‌ గుర్‌పత్వంత్‌ పన్నూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోతో పంజాబ్‌ పోలీసులు అప్రమత్తమైయ్యారు.

భగ్‌వంత్‌ సింగ్ ఆదివారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ప్రార్థనల తర్వాత అకల్‌ తఖ్త్‌ జతీందర్‌ వాసానికి వెళ్లి సమావేశమయ్యారు. కానీ, మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దాంతో ఆగ్రహించిన సిక్కు సంస్థ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ‘ఖలిస్థానీ రెఫరెండంపై ఓటింగ్‌ తేదీని సోమవారం అకల్‌ తఖ్త్‌ వద్ద భగ్‌వంత్‌ సింగ్ ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటను తప్పారు. 1995 ఆగస్టులో నాటి పంజాబ్‌ సీఎం బియాంత్‌ సింగ్‌ కారుబాంబు దాడిలో హత్యకు గురయ్యారు. త్వరలోనే ప్రస్తుత సీఎంకు కూడా అదే పరిస్థితి ఎదురౌతోందని అంటూ హెచ్చరించారు.

ఇటీవలే ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన విషయం తెలిసిందే. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయదుందుభి మ్రోగించి, 117 అసెంబ్లీ స్థానాల్లో 92 సీట్లను సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భగ్‌వంత్‌ సింగ్‌ పంజాబ్ సీఎంగా అధికారాలు చేపట్టారు. రాజకీయ నాయకుడిగా కేరీర్ ప్రారంభిన ఆయన.. పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ నియోజకవర్గం నుండి గతంలో వరుసగా రెండుసార్లు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎంపీగా గెలిచారు.