అలాగైతే జాతీయ పార్టీ పెడతాం..కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

అలాగైతే జాతీయ పార్టీ పెడతాం..కేటీఆర్

February 19, 2020

We will launch national party says ktr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటినుంచో జాతీయ రాకీయాల్లో క్రియాశీలకంగా మారాలని చూస్తున సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఏసియా సదస్సు 2020లో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, మంత్రి కేటీఆర్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. పీయుష్ గోయల్ మాట్లాడుతూ..కేవలం హైదరాబాద్, తెలంగాణను మాత్రమే ప్రమోట్ చేయడం కాదు.. దేశాన్ని కూడా మార్కెటింగ్ చేయాలని కోరారు. 

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..అలా చేయాల్సి వస్తే తాము జాతీయ పార్టీ పెట్టాల్సి వస్తుందని సమాధానమిచ్చారు. మీరు జాతీయ పార్టీతో ముందుకు రావచ్చు. ప్రస్తుతం దేశంలో ఇంకో జాతీయ పార్టీ అవసరం ఉందని పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడంలో కేంద్రం విఫలమవుతోందని ఎండగడుతోంది. మంగళవారం చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్ శంకుస్థాపన సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తలసాని చేసిన విమర్శలు చేశారు.