చంద్రబాబును సీఎం చేస్తాం : రాఘవేంద్రరావు - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబును సీఎం చేస్తాం : రాఘవేంద్రరావు

March 29, 2022

bvcccv

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు కంభంపాటి రామ్మోహన్ నాయుడు రచించిన ‘నేను తెలుగుదేశం’ పుస్తకాన్ని చంద్రబాబునాయుడు ఆవిష్కరించిన కార్యక్రమంలో రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘ నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎన్టీఆర్ గారు. అయోధ్య రాముడిని రామ చంద్రుడు అని కూడా అంటారు. రాముడు తర్వాత ఈ చంద్రుడు టీడీపీని తన విజన్‌తో ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. మీ విజన్‌లో భాగంగా టీడీపీ హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్, ఎస్వీబీసీ చైర్మన్‌గా సేవలందించే భాగ్యం నాకు లభించింది. మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా. మీ కోసం ఏం చేయడానికైనా మేం సిద్ధం. మీరు స్టార్ట్ అనండి. మేం యాక్షన్‌లోకి దిగుతాం. మిమ్మల్ని సీఎం చేస్తాం’అంటూ వ్యాఖ్యానించారు. కాగా, రాఘవేంద్రరావు వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది. స్టార్ట్, కెమెరా, యాక్షన్ చెప్పడానికి ఇదేం సినిమా కాదని ఎద్దేవా చేసింది. ‘చెత్త పనులు చేసినందుకే ఎన్నికల్లో ఓడించారు. మీరు, అశ్వనీదత్ లాంటి వాళ్లను పెట్టుకున్నందుకే టీడీపీ ఇలా అయింది. మీరంతా ఒకే తాను ముక్కలు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు భజన చేయడంతోనే రాఘవేంద్రరావుకు పదవులు, అశ్వనీదత్‌కు భూములు కేటాయించారు. వీళ్ల వ్యక్తిత్వం అంతా ఒకటే’నంటూ వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి దుయ్యబట్టారు.