అభ్యర్థుల ఫేస్‌బుక్ ఖాతాలపై ఎన్నికల సంఘం నిఘా - MicTv.in - Telugu News
mictv telugu

అభ్యర్థుల ఫేస్‌బుక్ ఖాతాలపై ఎన్నికల సంఘం నిఘా

October 3, 2018

ముందస్తు ఎన్నికల సందర్భంగా పోటీచేసే అభ్యర్థుల సోషల్ నెట్‌వర్క్ ఖాతాలపై ఈసీ నిఘా పెంచనుంది. అంతేకాదు ఎన్నికల ప్రవర్తానా నియమావళి విషయంలో ఎలక్ట్రానికి మీడియాకు వర్తించే నిబంధనలన్నీ వీటికి వర్తిస్తాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ హరితప్లాజాలో నిర్వహించిన కార్యశాలను ఆయన ప్రారంభించారు.

ett

ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లలో ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా ఖాతాలు పొందుపరచాలని సూచించారు. వీటిపై నిఘా పెట్టామని, అవసరమైతే సైబర్ క్రైమ్ అధికారుల సాయం తీసుకుంటామని తెలిపారు. మంత్రులు, నేతలు ప్రభుత్వ డబ్బులతో ఎన్నికల ప్రచారం చేయరాదని పేర్కొన్నారు. చెల్లింపు వార్తల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. కాగా ఓపినియన్ పోల్స్ పై ఎటువంటి నిషేధం లేదని రజత్ కుమార్ స్ఫష్టం చేశారు.