ఇండియలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం: మహీంద్రా - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం: మహీంద్రా

March 3, 2022

 

16

రష్యా – ఉక్రెయిన్ దేశాలు గత ఎనిమిది రోజులుగా ఢీ అంటే ఢీ అంటూ యుద్దంలో దూసుకుపోతున్నాయి. వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, యుద్ధాన్ని మాత్రం ఆపటంలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో భారతదేశంలో మెడికల్‌ కాలేజీని నిర్మించటానికి ఆయన సిద్ధం అయ్యారు.

”మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ నిర్మించాలి. అందుకోసం మహీంద్రా యూనివర్సిటీ బాధ్యులు తగు చర్యలు, ప్రణాళికలు సిద్దం చేయాలి” అని ఆయన సూచనలు చేశారు. అంతేకాకుండా ‘మన దేశంలో మెడికల్‌ కాలేజీలు లేవా ? ఎందుకు ఇంత మంది మెడిసన్‌ చదివేందకు వేరే దేశాలకు వెళ్తున్నారు? ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ పెట్టేందుకు అవకాశం ఉందా? అంటూ టెక్‌ మహీంద్రా చీఫ్‌ సీపీ గుర్నానిని ఆదేశించారు.

దీంతో ఆనంద్ మహేంద్ర ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ మన దగ్గర మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఎక్కడ చేస్తారు అన్నది ఇప్పుడు చర్చాంశంగా మారింది. అయితే మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉంది. దాంతో మెడికల్ కాలేజ్ కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.