వైసీపీ నాయకులకు..'అఖండ' చూపిస్తాం: శ్రీనివాసరావు - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీ నాయకులకు..’అఖండ’ చూపిస్తాం: శ్రీనివాసరావు

May 4, 2022

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకుల మధ్య టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక, వైసీపీ నాయకులందరికీ ‘అఖండ’ సినిమా చూసిస్తామని సవాల్ చేశారు.

మంగళవారం మల్లవోలులో ‘పల్లె పిలుస్తోంది కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ..”మాకు వైసీపీ నాయకులు శత్రువులు కాదు. మా నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, అవమానించడం, దౌర్జన్యాలు, దాడులు చేయడం హేయమైన చర్య. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘అఖండ సినిమా చూపిస్తాం” అని ఆయన అన్నారు.

మరోపక్క యరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గం నుండి మూడుసార్లు టీడీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులను ఆయన ఖండిస్తూ, వైసీపీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలో అరాచకం తప్పితే అభివృద్ధి లేదని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.