మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు నేర్పిస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు నేర్పిస్తాం

February 16, 2020

Asaduddin Owaisi

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు కూడా నేర్పిస్తామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ఓ కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు కూడా నేర్పిస్తాం. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపినా వెళతాం. 25 ఏళ్లుగా భద్రత లేకుండానే తిరుగుతున్నాను. నన్ను చంపేయాలనుకుంటే చంపేసుకోవచ్చు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు నా చెప్పుతో సమానం. ముస్లింలకు కాంగ్రెస్ అవసరం లేదు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదు’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు. 

 

ఒవైసీని కేసీఆర్ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు..

తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత ఒవైసీపై టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భైంసాలో జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ అల్లర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. భద్రత కల్పించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మజ్లిస్ పార్టీ ఆగడాలను అరికట్టకపోతే భైంసా లాంటి ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా జరిగే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌లో మేము అనుభవించిన బాధలు ఈరోజున భైంసాలో ప్రజలు అనుభవిస్తున్నారు. ఒవైసీని కేసీఆర్ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే టీఆర్ఎస్‌కూ పడుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయాలి’ అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.