Weapon, uniform stolen from police station in UP's Kanpur
mictv telugu

పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం.. ఓ తుపాకీ, యూనిఫాంలు మాయం

November 11, 2022

ఇంట్లోనో, పని చేసే చోటో లేదంటే ప్రయాణించే సమయంలో.. ఏదైనా వస్తువు పోయినప్పుడు, దొంగతనం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లయింట్ చేస్తాం. అదే మరీ పోలీస్ స్టేషన్‌లో దొంగతనం జరిగితే.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఇది నిజం. పోలీసుల తుపాకీనే ఎత్తుకెళ్లాడో ఘనుడు. తుపాకీనే కాదు పోలీస్‌ యూనీఫాం, పది కాట్రిజ్‌లును కూడా దొంగిలించాడు.

కాన్పూర్‌లోని న్యూ ఆజాద్‌ నగర్‌ పరిధిలోని బిద్నూ ఔట్‌పోస్టులో గురువారం రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసు పిస్తోల్‌తోపాటు యూనిఫాంను ఎత్తుకెళ్లారు. తుపాకీ కనింపించకపోవడంతో.. ఔట్‌పోస్ట్‌ ఇన్‌చార్జీ సుధాకర్‌ పాండే కేసు నమోదుచేశారు. అయితే విషయం కాస్తా పై అధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా ఎస్పీ.. సుధారక్‌ పాండేపై వేటువేశారు. పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ తుపాకీతోపాటు యూనీఫాం, పది కాట్రిజ్‌లు కనిపించకుండా పోయాయని గుర్తించారు. ఈ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు