పాక్ నుంచి ఆదిలాబాద్‌కు డ్రోన్లలో ఆయుధాలు.. పట్టుకున్న పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ నుంచి ఆదిలాబాద్‌కు డ్రోన్లలో ఆయుధాలు.. పట్టుకున్న పోలీసులు

May 5, 2022

పాకిస్తాన్ నుంచి తెలంగానలోని ఆదిలాబాద్‌కు ఆయుధాలు తరలిస్తున్న ముఠాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో నలుగురు ఖలిస్తానీ ఉగ్రవాదులను పట్టుకున్నారు. వారి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సమాగ్రి, టిఫిన్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ పక్కా సమాచారంతో పోలీసులు సోదా చేసి అనుమానిత ఉగ్రవాదిని పట్టుకొని విచారించగా, ఈ విషయం బయటపడింది. పాక్ నుంచి ఆదిలాబాదుకు డ్రోన్ల ద్వారా ఆయుధాలు చేరవేస్తున్నట్టు విచారణలో తేలిందని కర్నాల్ ఎస్పీ వెల్లడించారు.

ఇప్పటికే ఆయుధాలు నాందేడ్ వరకు చేరాయని ఆయన తెలిపారు. 20 నుంచి 25 ఏళ్ల వయసున్న నలుగురు నిందితులను గురుప్రీత్, అమన్‌దీప్, పర్మీందర్, భూపిందర్‌గా గుర్తించారు.