ఆశ్రమమా? ఆయుధాగారమా! - MicTv.in - Telugu News
mictv telugu

ఆశ్రమమా? ఆయుధాగారమా!

September 4, 2017

రేప్ బాబాగా వార్తల్లోకెక్కిన డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం బాబా ఆశ్రమంలో గుట్టలకొద్దీ ఆయుధాలు బయటపడుతున్నాయి. సిర్సాలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించి భారీ స్థాయిలో మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు భక్తులు స్వయంగా వాటిని అందించారు. ఇంతవరకరు 37 ఏకే 47, రివాల్వర్లు, రైఫిల్స్ , మిషన్ గన్లు, ఇతర రకాలకు చెందిన 60 తుపాకులు దొరికాయి.

వాటిని స్వాధీనం చేయకపోతే దాడులు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో బాబా భక్తులు దిగొచ్చారు. సిర్సా ఆశ్రమంలో బాబా.. తన అనుచరులకు మారణాయుధాల వాడకంపై శిక్షణ ఇచ్చేవారని ఇదివరకే వార్తులు వచ్చాయి. అసలు ఆధ్యాత్మిక గురువుకు ఆయుధాలతో పనేంటని కొందరు విమర్శకులు అంటున్నారు. అయితే బాబాకు ఆయుధాల వాడకం కొత్తేమీ కాదు. 2002లో ఓ మహిళపై అత్యాచారం చేసే అసమయంలో ఆయన మంచంపై రివాల్వర్ ఒకటి కనిపించిందని బాధితులు చెప్పారు.