జోయెల్ స్ట్రాసర్ ఐదు పౌండ్ల బరువున్న 700 కంటే ఎక్కువ బాబుల్స్ ని ధరించాడు. దానికోసం తన స్వంత ప్రపంచ రికార్డును తానే అధిగమించిన ఘనత అతనికి దక్కింది.
మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టడం, జుట్టును అందంగా అలంకరించడం చూశాం ఇప్పటివరకు. కానీ గడ్డం కూడా క్రిస్మస్ ట్రీని అలంకరించినట్టు.. అలకంరించొచ్చని, దాంతో రికార్డు సృష్టించొచ్చని తెలియచేశాడు జోయెల్. క్రిస్మస్ సందర్భంగా అతను చేసిన ఫీట్ ఇప్పుడు గిన్నీస్ రికార్డుల్లోకెక్కింది.
ఇడాహూలోని కునాకు చెందిన జోయెల్ స్ట్రాసర్ తన రికార్డును తానే అధిగమనించాడు. దీనికి అతను చాలా టెక్నిక్స్ ఉపయోగించాల్సి వచ్చింది. అవి అలాగే నిలిచిపోయేలా కూడా చేసేందుకు చాలా కష్టాలే పడ్డాడు. జోయెల్ మొదటిసారి 2019లో 302 బాబుల్స్ ని గడ్డానికి అలంకరించాడు. ఆ తర్వాత 2020లో 542 బాబుల్స్, 2021లో మూడోసారి 686 బాబుల్స్ తో రికార్డు సృష్టించాడు. ఇప్పడు తన రికార్డును తానే బద్దలు కొట్టి 710 బాబుల్స్ ని గడ్డానికి అలంకరించాడు. ఇవి ఐదు పౌండ్లు అంటే సుమారు రెండు కేజీల పై మాటే ఉంటాయి. అంత బరువున్న బాబుల్స్ ని పెట్టడం అంటే అషామాషీ కాదు.
ఈ ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే ఈ సంవత్సరం వీటిని అటాచ్ చేయడానికి రెండున్నర గంటలు పట్టిందంటున్నాడు జోయెల్. ‘మొదట వాటిని చాలా అస్థిరంగా ఉంచాను. అందుకే మొదటి గడ్డం బాబుల్ రికార్డ్ చాలా తక్కువగా ఉంది. నేను ఇంకా గడ్డంలో క్యాండీలను పెట్టాలని ఆలోచిస్తున్నా. కానీ ఇంకా ప్రయత్నం చేయలేదు. దాన్ని కూడా చేసి రికార్డు సంపాదిస్తా. బాబుల్స్ గడ్డానికి పెట్టడం వల్ల కొంత అసౌకర్యం ఉంటుంది. కిందకు లాగుతుంటాయి. కానీ రికార్డు సంపాదించాలంటే అవన్నీ భరించి తీరాల్సిందే’ అంటున్నాడు జోయెల్.