మోదీ.. ఆ టోపీ పెట్టుకున్నంత మాత్రాన నేతాజీ కాలేరు.. శోభాడే - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ.. ఆ టోపీ పెట్టుకున్నంత మాత్రాన నేతాజీ కాలేరు.. శోభాడే

October 23, 2018

ఆజాద్ హింద్ ఫౌజ్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ… ఫౌజ్ టోపీని ధరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయ కేవలం షో కోసమే ఇలా చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. రచయిత్రి, కాలమిస్టు శోభాడే సోషల్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు.Wearing an icon's trademark 'topi' does not make you a Netaji tweets Shobha De,  invited ire of Modi’s supporters for taking a dig at the Prime Minister, saying ‘wearing iconic cap doesn’t make you Netaji’సుభాష్ చంద్రబోస్ ధరించిన ఆజాద్ హింద్ ఫౌజ్ టోపి ధరించినంత మాత్రాన మీరు నేతాజీ కాలేరు’ అని ఆమె మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో మోదీ మద్ధతుదారులు, బీజేపీ అనుచరులు భగ్గుమంటున్నారు. మీరు పేపరుపై ఏదో రాస్తే మీరు రచయిత్రి అవుతారా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. గాంధీ టోపీ పెట్టుకున్నంత మాత్రాన రాహుల్.. గాంధీ కాలేడని అంటున్నారు శోభాడేకు మద్దతుగానూ స్పందిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్‌ మిస్టరీపై నాలుగేళ్లుగా ఏమీ తేల్చని మోదీ ఇప్పుడు ఆయన టోపీ ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. సుభాష్‌ను మోదీనే కాకుండా  గత ప్రభుత్వాలు కూడా గౌరవించాయని, కోల్ కతా విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారని గుర్తు చేస్తున్నారు.