నాకు నచ్చిన గుడ్డలు వేసుకుంటా.. మీకేం నొప్పి? - MicTv.in - Telugu News
mictv telugu

నాకు నచ్చిన గుడ్డలు వేసుకుంటా.. మీకేం నొప్పి?

May 15, 2019

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ తనను ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘నాకు నచ్చిన గుడ్డలు వేసుకుంటా.. మీకేం నొప్పి’ అని పొట్టి దుస్తులతో వున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఎందుకు మాళవికకు అంత కోపం వచ్చింది.

ఆమె ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిపై నెటిజన్లు  ‘సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు ఎలాంటి దుస్తులు ధరిస్తారో తెలుసా’ అని కామెంట్లు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మాళవిక తన మరో హాట్ ఫోటోను షేర్ చేసి వాళ్లకు ఘాటు సమాధానం ఇచ్చింది.

‘సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఓ గౌరవ ప్రదమైన అమ్మాయి ఎలా డ్రెస్‌ చేసుకోవాలో చెప్తూ చాలా మంది కామెంట్లు చేశారు. అందుకే ఈ ఫోటో మీకోసం. నాకు నచ్చిన బట్టలు వేసుకుని గౌరవప్రదంగా కూర్చున్నాను’ అని స్టేటస్ పెట్టింది. గతంలో ఇలాగే బాలీవుడ్ దంగల్ హీరోయిన్ ఫాతీమా సనా షేక్ బట్టల విషయంలో కూడా నెటిజన్లు తలతిక్క కామెంట్లు చేశారు. అప్పుడామె కూడా తన మరో ఫోటోతో ఘాటుగా సమాధానం చెప్పింది. మాళవిక కూడా ఫాతిమా దారిలో వెళ్లి వాళ్లకు సమాధానం చెప్పింది.  

మాళవిక మలయాళ ఇండస్ట్రీలో తెరకు పరిచయం అయింది. ఆ తరువాత తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించింది. ఇటీవల ‘పేట’ సినిమాతో మంచి గుర్తిం‍పు తెచ్చుకుంది. తెలుగులో త్వరలో విజయ్‌ దేవరకొండ సరసన నటించబోతోంది.