పెళ్లి పుస్తకమైన శుభలేఖ.. క్యూఆర్ కోడ్ కూడా - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి పుస్తకమైన శుభలేఖ.. క్యూఆర్ కోడ్ కూడా

April 23, 2022

పెళ్లి అనేది ప్రతి యువకుని, యువతి జీవితంలో ప్రముఖమైన ఓ ఘట్టం. తల్లిదండ్రులు తమ బిడ్డల పెళ్లి ఇలా చేయాలి. అలా చేయాలని చాలా ప్లాన్స్ వేసుకుంటారు. కొత్తగా కొత్తగా ఆలోచిస్తుంటారు. అయితే, ఓ తండ్రి తన కుమారుని పెళ్లి పత్రిక విషయంలో కొత్తగా ఆలోచన చేశాడు. సామాన్యంగా పెళ్లి పత్రికను ఇస్తే, బంధువులు చదివిన తర్వాత దానిని ఏదో ఓ మూలకు పడేస్తారు. అలా పెళ్లి కార్డ్‌ను పడేయకుండా ఉండడానికి ఆ తండ్రి పెళ్లి కార్డ్‌ను పుస్తకంగా ప్రింట్ చేయించాడు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మునగపాక గ్రామం చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన విల్లూరి నూక నర్సింగరావు తన కుమారుడి పెళ్లి పత్రికను ఓ మంచి డిజైన్ చేయించి, బంధుమిత్రుల కుటుంబాలలోని పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకంలా తయారు చేయించాడు. అంతేకాకుండా ఆ పత్రికకు క్యూఆర్ కోడ్ కూడాను జోడించి ఔరా అనిపించికున్నాడు. ఈనెల 24వ తేదీ ఆదివారం తన కుమారుడు విల్లూరి హరీష్ పెళ్లి జరగనుంది. ఇందుకోసం పెళ్లి కార్డులు కూడా ముద్రించాడు. బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు పెళ్ళి ఆహ్వాన పత్రికను అందించాడు. అయితే, ఆ పత్రికను చూసిన వారంతా నరసింగరావు ఐడియాను అభినందించారు.