వరదనీటిలో పెళ్లి బస్సు.. ముందుకు కదల్లేక.. వెనక్కి వెళ్లలేక.. - MicTv.in - Telugu News
mictv telugu

వరదనీటిలో పెళ్లి బస్సు.. ముందుకు కదల్లేక.. వెనక్కి వెళ్లలేక..

June 21, 2022

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం కేసారం వద్ద పెళ్లి బస్సు చిక్కుకుపోయింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన వద్ద వరదనీటిలో చిక్కుకున్న బస్సు.. ముందుకు కదల్లేక.. వెనక్కి వెళ్లలేక అక్కడే ఇరుక్కు పోయింది. బస్సులో ఉన్నవారంతా సుక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన పెళ్లి బస్సు.. కోటపల్లి మండలంలో పెళ్లి వేడుకను ముగించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వరద నీటిలో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు ముందుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విషయాన్ని బస్ లో ఉన్న ప్రయాణీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని బస్సులో ఉన్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీశారు. నికుల సహాయంతో పోలీసులు బస్సులోని ప్రయాణీకులను బయటకు తీశారు. సోమవారం నాడు కురిసిన భారీ వర్షంతో ఆర్‌ఓబీ కింద వరద నీరు పోటెత్తింది. రైల్వే సిబ్బంది విద్యుత్‌ మోటార్ల ద్వారా వరద నీటిని తోడారు.