పెళ్లిని చెడగొట్టిన జొమాటో బిర్యానీ.. ఏకంగా 3,500 కేజీల మాంసం - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిని చెడగొట్టిన జొమాటో బిర్యానీ.. ఏకంగా 3,500 కేజీల మాంసం

May 24, 2022

ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లంటే మామూలు విషయం కాదు. చాలా ప్రతిష్టాత్మకంగా తమ స్టేటస్‌కు తగ్గట్లు జరుపుకునే వేడుక. పెళ్లి తంతు, కట్నకానుకల దగ్గర నుండి అతిథులకు స్వాగత సత్కారాలు, విందు వినోదాలు.. అబ్బో ఇలా ఒకటేమిటి కలకాలం గుర్తుండిపోయేలా జరుపుకుంటారు. అలా ఓ ఇంట్లో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. కారణం ప్రేమ వ్యవహారమో.. లేదంటే కట్నం వ్యవహారమో కాదు… బిర్యానీ లేదని. అవును విందు భోజనాలకు ఆర్డర్ చేసిన బిర్యానీ క్వాలిటీ లేకపోవడమే ఈ ఘటన తమిళనాడులోని ఓరథనాడులో జరిగింది. అన్‌లైన్ ఫుడ్ సరఫరా చేసే జోమాటో నిర్వాకానికి ఆ కొత్త జంట ఒక్కటి కాలేకపోయారు.

పెళ్లి వారు విందు భోజనం కోసమని సేలం ఆర్ ఆర్ బిర్యానీ సెంటర్ నిర్వహకులకు కాంట్రాక్ట్ ఇచ్చారు. వారు జొమాటో ద్వారా 3,500 కిలోల మాంసం(చికెన్, మటన్ కలిపి) ఆర్డర్ తీసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్‌లో టన్నులలో కుళ్లిపోయిన మాంసం రావడంపై పెళ్లి బృందం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు కుళ్లిన మాంసంగా నిర్ధారించారు. దీనిపై సేలం ఆర్ ఆర్ బిర్యానీ, జొమాటో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అటు, బిర్యానీ లేకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు ఇరువురి కుటుంబసభ్యులు తెలిపారు.