నేటి నుంచి పెళ్లిళ్లు షురూ.. ముహుర్తాలు ఇవీ - MicTv.in - Telugu News
mictv telugu

నేటి నుంచి పెళ్లిళ్లు షురూ.. ముహుర్తాలు ఇవీ

April 13, 2022

04

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా చాలా తక్కువ పెళ్లిళ్లు జరిగాయి. అంతేకాకుండా కరోనా నిబంధనల కారణంగా చాలా తక్కువ మందితో పెళ్లిళ్లు జరిగాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడటం, ఎలాంటి కరోనా నిబంధనలు లేకపోవడంతో వివాహాలకు పూర్తి స్థాయిలో బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి బట్టల షాపింగ్, బంగారం కొనుగోలు, ఆహ్వాన పత్రికలు, కళ్యాణ మండపాల బుకింగులు ప్రారంభమయ్యాయి. శుభకృత్ నామ సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలో పురోహితులు చెప్పిన ప్రకారం ముహుర్తాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. ఏప్రిల్ : 13, 14, 15, 16, 17, 21, 22, 24
2. మే : 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25
3. జూన్ : 1, 3, 5, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23