పోస్టులో మంగళసూత్రం.. ఆన్‌లైన్‌లో ఆశీర్వాదాలు.. ఇదో వెరైటీ పెళ్లి
కరోనాతో కళ్యానాలకు కష్టకాలం వచ్చిపడింది. పెళ్లి చేసుకొని ఏమమైపోవాలని కలలు కంటున్న కొత్త జంటలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కానీ కొంత మంది మాత్రం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యుల సమక్ష్యంలో చేసుకుంటున్నారు. అయితే ఓ నవ జంట మాత్రం పూర్తి భిన్నంగా తమ పెళ్లి చేసుకుంది. అధ్యాంతం ఈ పెళ్లిలో అన్ని వెరైటీగానే జరిగిపోయాయి. వీడియో కాలింగ్ ద్వారా తల్లిదండ్రులు, అతిథులు వివాహాన్ని వీక్షిస్తుండగా.. మూడు ముళ్లు వేశాడు. పూణేలో జరిగిన ఈ వివాహ వేడుక అందరిని ఆశ్చర్యపరిచింది.
కేరళకు చెందిన విఘ్నేష్, అంజలిలకు కొన్ని రోజుల క్రితం బంధువులు పెళ్లి నిశ్చయించారు. కరోనా కారణంగా పెళ్లికి ఆటంకం ఏర్పడింది. దీంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించి
జూమ్ యాప్ ద్వారా బంధువులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకను వీక్షించే ఏర్పాటు చేశారు. ఇక సంప్రధాయం ప్రకారం వరుడి కుటుంబం మంగళ సూత్రం తేవాల్సి ఉండటంతో దాన్ని స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. దాన్ని తీసుకొని విఘ్నేష్ తాను ఉంటన్న అపార్ట్‌మెంట్‌లో మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచి ఈ జంట ఏకమౌతున్న సమయంలో బంధువులు వీడియో కాలింగ్ ద్వారానే ఆశీర్వాదాలు అందజేశారు. ఇది చాలా భిన్నమైన అనుభూతి అని ఎప్పటికీ తమ పెళ్లి గుర్తుండిపోతుందని చెప్పారు. కాగా మంగళసూత్రం డెలివరీ చేసిన ఇండియన్ పోస్టల్ శాఖకు నూతన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.