Wedding video: bride pushed groom into swimming pool then what happened watch viral video
mictv telugu

పెళ్లికి ముందే మునిగిపోయిన జంట.. వీడియో వైరల్

May 6, 2022

Wedding video: bride pushed groom into swimming pool then what happened watch viral video

తన పెళ్లికి సంబంధించి ఫోటో షూట్‌ చేస్తున్న సమయంలో ఓ వధువు చేసిన కొంటె పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అకస్మాత్తుగా ఆమె చేసిన పనికి షాకైన వరుడు అంతే తెలివిగా ఆలోచించడంతో ఈ వీడియో కాస్తా సరదాగా మారిపోయింది. దీంతో నెటిజన్లు కూడా చాలా సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఫొటోగ్రాఫర్‌కి పోజు ఇస్తున్న సమయంలో ఆ వధువు… వరుడిని పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ నెట్టివేసేందుకు ట్రై చేస్తుంది. కానీ, వరుడు ఆమె కంటే వేగంగా ప్రతిస్పందించి.. తానొక్కడే స్విమ్మింగ్ ఫూల్‌లో పడిపోకుండా, వధువును కూడా పట్టుకుని దూకుతాడు. ఆ తర్వాత నీటిలో తడిసిన వరుడిని వధువు కౌగిలించుకొని ముద్దాడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు.

వధూవరుల ఈ అందమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో థియోడరబుల్ వెడ్డింగ్స్ అనే పేజీలో షేర్ చేశారు. 4 రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు 2 లక్షల 91 వేల మందికి పైగా ఈ వీడియోని లైక్ చేశారు.