వెనక్కి తగ్గారు.. రాజ్యసభ మార్షల్స్‌కు మళ్లీ తలపాగా..  - MicTv.in - Telugu News
mictv telugu

వెనక్కి తగ్గారు.. రాజ్యసభ మార్షల్స్‌కు మళ్లీ తలపాగా.. 

November 25, 2019

Week after uniform row, Rajya Sabha marshals switch back to bandhgalas

రాజ్యసభలో మార్షల్‌కు భారత మిలిటరీ దుస్తుల వంటివి వేయడంపై పెద్ద దూమారమే చెలరేగింది. విమర్శలు తారస్థాయికి చేరడంతో సభాపతి వెనక్కి తగ్గారు. రాజ్యసభలో మార్షల్స్‌కు మళ్లీ పాత సంప్రదాయ వస్త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మిలటరీ వస్త్రాలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 పార్లమెంట్‌లోని ఇరు సభల్లోని మార్షల్స్‌కు భారతీయ సంప్రదాయంలో తలగాపాగాతో కూడిన వస్త్రధారణ ఉంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం వారికి భారత సైనికులు ధరించేటువంటి వస్త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ స్వాగతించలేదు. భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మార్షల్ చట్టాన్ని విధించినట్టు ఉందని సోమవారం పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆర్మీ అధికారులు కూడా నూతన డ్రెస్ కోడ్ అక్రమమని అన్నారు. దీంతో డ్రెస్ కోడ్‌పై చైర్మన్ వెంకయ్యనాయుడు సమీక్షకు ఆదేశించారు. సమీక్ష అనంతరం వాటిని తొలగించి పాత వస్త్రధారణ అయిన తలపాగతో కూడిన భారతీయ సాంప్రదాయ దుస్తులనే కొనసాగించాలని సభాపతి నిర్ణయించారు.