షాకింగ్.. ఈ దున్నపోతు ధర రూ.14 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

షాకింగ్.. ఈ దున్నపోతు ధర రూ.14 కోట్లు

February 3, 2020

Buffalo.

అడ్డంగా, పొడవుగా, కుదమట్టంగా ఉన్న ఈ దున్నపోతును చూస్తే మీకు ఏం గుర్తుకువస్తోంది. మన వద్ద ఏటా జరిగే సదర్ ఉత్యవాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. వాటికి నున్నగా నూనె పూస్తారు. వాటి ధర లక్షల్లో ఉంటుంది. కానీ ఈ దున్నపోతు ధర మీరు లక్షల్లో ఉంటుంది అనుకుంటే పొరబడ్డట్టే. దీని ధరతో ఈ దున్నపోతు జాతీయంగా చాలా ఫేమస్ అయింది. తన ఒడ్డూ పొడుగులోనే భారీ దున్నపోతుగా కాకుండా ధరలో కూడా భారీ ధరను నమోదు చేసుకుంది. దీని విలువ అక్షరాలా రూ.14 కోట్లు పలుకుతోంది. 1300 కిలోల బరువున్న ఇది రాజస్థాన్‌లోని నాగోరీ పశు మేళాలో ఎందరినో ఆకట్టుకుంటోంది. 

అరవింద్ అనే వ్యక్తి ఈ దున్నపోతు పోషణను చూస్తున్నాడు. ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతుకు అతను ముద్దుగా భీమ్‌ అని పేరు కూడా పెట్టాడు. నాగౌరీలో ఇటీవల జరిగిన పశు మేళాలో భీమ్‌ను చూడటానికి జనాలు ఎగబడ్డారు. ప్రస్తుతానికి భీమ్‌ విలువ మార్కెట్‌లో రూ.14 కోట్లు పలుకుతోందట. అంత రేటు వస్తున్న యజమాని అరవింద్ మాత్రం దానిని విక్రయించడానికి ఒప్పుకోవడంలేదు. చాలామంది అతన్ని ‘మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకోవయ్యా బాగుపడతావు’ అని ఎంత పోరినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు ఆయన. 

అతను భీమ్‌ ఆరోగ్యం, అందమైన శరీరాకృతి కోసం.. ఒక్క రోజుకు సుమారు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నాడు. వైద్యులు సూచించిన ప్రకారం  ప్రొటీన్‌ డైట్‌లో భాగంగా సోయాబీన్‌, శనగలు వంటి ధాన్యాలతో కూడిన ఆహారం దానికి రోజూ పెడతాను అంటున్నాడు. అలాగే ప్రతిరోజూ ఉదయం దీనికి నూనెలతో ప్రత్యేకంగా మసాజ్ కూడా చేస్తారట.