Weight lifter Sanjitha failed doping test
mictv telugu

దేశం పరువు తీస్తున్నారు.. డోపింగ్ టెస్టులో పట్టుబడ్డ స్టార్ వెయిట్ లిఫ్టర్

January 7, 2023

Weight lifter Sanjitha failed doping test

దేశ క్రీడారంగంలో మరోసారి డోపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. మణిపూర్ కి చెందిన స్టార్ మహిళా వెయిట్ లిఫ్టర్, రెండు సార్లు కామన్ వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత కుముక్ చమ్ సంజిత చాను డోపింగ్ టెస్టులో విఫలమైంది. ఈమె నుంచి గతేడాది జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా శాంపుల్స్ సేకరించారు. అందులో నిషేధిత ఉత్ప్రేరకం డ్రొస్టనొలోన్ వాడినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని డోపింగ్ నిరోధక అధికారులు వెల్లడించగా, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ సంజితపై ప్రాథమిక నిషేధం విధించింది. అంతేకాక, శాంపిల్ సేకరించిన నాటి నుంచి నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, గతేడాది జరిగిన జాతీయ క్రీడా పోటీల్లో సంజిత రజత పతకం గెలుచుకుంది. బంగారు పతకాన్ని టోక్యో ఒలంపిక్స్ రజక పతక విజేత మీరాబాయి చాను కైవసం చేసుకుంది.