కండోమ్‌కు బొక్కలు బెట్టి 6 నెలలు బొక్కలో పడింది... - MicTv.in - Telugu News
mictv telugu

కండోమ్‌కు బొక్కలు బెట్టి 6 నెలలు బొక్కలో పడింది…

May 6, 2022

కొన్ని ‘నేరాలు’ ఊహకందవు. ముఖ్యంగా శృంగారానికి సంబంధించిన ‘అఘాయిత్యాలు’ చిత్రంగా ఉంటాయి. సెక్సు మధ్యలో కండోమ్ తీసేసి మోసం చేశాడని, గర్భం వచ్చిందని కోర్టుకెళ్లిన అమ్మాయిల కేసులు చాలానే ఉన్నాయి. అయితే జర్మనీలో సీన్ రివర్స్ అయింది. గర్భం దాల్చడానికి కండోమ్‌కు చిల్లులు పెట్టినందుకు కోర్టు ఓ మహిళలకు ఆరు నెలల జైలు శిక్ష వేసింది.

జర్మనీలోని బీల్ ఫీల్డ్కు చెందిన 39 ఏళ్ల మహిళ, 42 ఏళ్ల ప్రియుడితో సహజీవనం చేస్తోంది. అతడు ఆ సంబంధాన్ని లైట్గా తీసుకున్నాడు. ఆమె మాత్రం సీరియస్గా తీసుకుని అతనితో బిడ్డను కనాలనుకుంది. పిల్లాజెల్లా జంజాటం అతనికి ఇష్టం లేదు. అందుకే జాగ్రత్తగా కండోమ్ పెట్టుకుlr రాసలీలలు సాగిస్తున్నాడు. దీంతో ఆమె అతనికి తెలియకుండా కండోములకు చిల్లులు పెట్టింది. ఫలితంగా గర్భం దాల్చింది. అంతటితో ఊరుకోకుండా ఆ విషయాన్ని ఏదో ఘనకార్యం అన్నట్లు అతనికి వాట్సాప్‌లో చెప్పేసింది. అతడు గొల్లుమంటూ కోర్టుకెక్కాడు. వీర్యం కోసం ఆమె కండోములకు చిల్లులు పెట్టడం చోరీలాంటి నేరమేనంటూ కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.