Went For Funeral After Snakebite
mictv telugu

పాముకాటుతో అన్న మృతి.. చూడ్డానికి వెళ్లిన తమ్ముడూ..ఒకే పాము?

August 5, 2022

కొన్ని సంఘటనలు నమ్మశక్యంగా ఉండవు. ఉత్తరప్రదేశ్లో అలాంటిదే జరిగింది. పాముకాటుతో చనిపోయిన అన్న అంత్యక్రియలకు హాజరైన తమ్ముడు కూడా పాముకాటుతోనే చనిపోయాడు. ఇద్దరినీ ఒకే పాము కాటు వేసి ఉంటుందని భావిస్తున్నారు. బలరాంపూర్ జిల్లా భవానీపూర్ గ్రామానికి చెందిన అరవింద్ మిశ్రా(38) మంగళవారం పాముకాటుతో మరణించాడు. పంజాబ్ లూథియానాలో ఉన్న అతడి సోదరుడు గోవింద్ మిశ్రా (32) విషయం తెలుసుకుని కడచూపు కోసం భవానీపూర్ వచ్చాడు.
అంత్యక్రియలు ముగిశాక గోవింద్ మిశ్రా తన బంధువైన చంద్రశేఖర్ పాండేతో కలసి ఒక గదిలో పడుకున్నారు. నిద్రలో ఉండగా ఓ పాము ఇద్దరినీ కాటేసింది. గోవింద్ మిశ్రా అక్కడికక్కడే చనిపోగా చంద్రశేఖర్ పాండేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్నదమ్ములు ఒక రోజు తేడాతో ఒకేలా చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.