హనీమూన్‌కు వెళ్ళి హోటల్‌నే కొనేశారు… - MicTv.in - Telugu News
mictv telugu

హనీమూన్‌కు వెళ్ళి హోటల్‌నే కొనేశారు…

October 12, 2018

ఎవరికైనా ఎక్కడికైనా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది ? బాగుంటే మళ్లీ వెళ్ళాలనిపిస్తుంది. ఆ జ్ఞాపకాలను దాచుకోవటానికి ఫోటోలు, వీడియోలు తీసుకోవడం సర్వసాధారణం. కానీ ఓ జంట హనీమూన్ కోసం శ్రీలంక వెళ్ళి అక్కడ ఓ హోటల్‌నే కొనేశారు. తాగిన మైకంటో హోటల్ కొనేసి ఇప్పుడు వాళ్ళు హోటల్ యజమానులు అయిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. లండన్‌కు చెందిన గినా లేయాన్స్ (33), మార్క్‌లీ (35) గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. మూడు వారాల హనీమూన్ కోసం శ్రీలంక వెళ్ళారు.  అక్కడ సముద్ర తీరంలో ఉన్న ఓ హోటల్‌లో బస చేశారు. అక్కడి వాతావరణం వారిని బాగా ఆకట్టుకుంది. హోటల్ సిబ్బంది ఇచ్చిన మర్యాద వాళ్ళకు బాగా నచ్చింది.Went to honeymoon… The liquor was purchased by the hotelఈ క్రమంలో ఓరోజు వాళ్ళిద్దరు ఫూటుగా రమ్ కొట్టారు. అప్పటికే వారిద్దరు ఈ ప్రపంచంలో లేనట్టు మత్తుతో ఊగిపోతున్నారు. ఇంతలో వారి దగ్గరకు బార్ టెండర్ ఒకరు చనువుగా వచ్చి హోటల్ లీజ్ దగ్గర పడుతోందని వారికి చెప్పాడు. తాగినవాళ్ళకు మాట మీద నిలకడ వుండదంటారు. అది వాళ్ళ విషయంలో నిజమైంది. హోటల్‌ను మేమే లీజుకు తీసుకుంటామని చెప్పారు.

30 వేల పౌండ్ల(రూ.30 లక్షలు) వెంటనే చెల్లించి హోటల్‌కు యజమానులు అయిపోయారు. ఇకనుంచి ఈ హోటల్ తమదని భావించిన ఆ దంపతులు హోటల్ పేరును

‘లక్కీ బీచ్ టాంగలే’గా మార్చేశారు.

మూడేళ్ల లీజుకు హోటల్‌ను తీసుకున్నామని, 2019తో గడువు ముగుస్తుందని గినా తెలిపారు. హనీమూన్‌కు వెళ్లి హోటల్‌కు యజమానులమయ్యాం అని తాాజాగా ఈ విషయాన్ని ఆ దంపతులు వెల్లడించారు.