Home > Featured > కన్నతండ్రిని 6 ముక్కలుగా నరికి.. మూటగట్టి..

కన్నతండ్రిని 6 ముక్కలుగా నరికి.. మూటగట్టి..

ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అది మరువక ముందే తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ బంగాల్లో జరిగింది. కన్నతండ్రిని హత్య చేసిన ఓ కొడుకు.. ఆ తర్వాత అతని శవాన్ని 6 ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో పారేశాడు. అనంతరం తన తండ్రి కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య, కుమారుడిపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో భార్య సహా అతడి కొడుకు అరెస్ట్ చేశారు.

పరగణాల జిల్లాలోని బారుయ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఉజ్వల్ చక్రవర్తి.. గతంలో నేవీలో పనిచేశాడు. 12 ఏళ్ల కింద రిటైర్ అయి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. పరీక్ష ఫీజు కోసం అతని కొడుకు రూ.3వేలు అడగగా.. అందుకు చక్రవర్తి నిరాకరించాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య జరిగిన గొడవ.. ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన కొడుకు.. తండ్రిని నెట్టేశాడు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన చక్రవర్తిని గొంతు నులిమి చంపేశాడు. తర్వాత బాత్‌రూమ్కు తీసుకెళ్లి శరీరాన్ని రంపంతో 6 ముక్కలు చేశాడు. ఆ శరీర భాగాలను ఓ సంచిలో మూటగట్టి పరిసర ప్రాంతాల్లో విసిరేశాడు.

Updated : 20 Nov 2022 6:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top