హీరోయిన్‌గా అందాల ఎంపీ.. డైరెక్టర్‌గా మంత్రి..  - MicTv.in - Telugu News
mictv telugu

హీరోయిన్‌గా అందాల ఎంపీ.. డైరెక్టర్‌గా మంత్రి.. 

February 26, 2020

West Bengal.

లోక్‌సభ ఎంపీ నుస్రత్ జహాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. సినిమాల నుంచి గత ఏడాదే రాజకీయాల్లోకి వచ్చిన ఆమె మతాంతర వివాహం చేసుకుని తెలియని వారికి కూడా తెలిసిపోయారు. అంతేకాకుండా కట్టుబాట్లను లెక్కచేయకుండా ప్రజలతో కలసిమెలసి పోతున్నారు. కొన్నాళ్లు విరామం తీసుకున్న ఆమె మళ్లీ కెమెరా ముందుకు వచ్చేస్తోంది. అది కూడా ఓ మంత్రి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా. 

పశ్చిమ బెంగాల్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బ్రత్యా బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిక్షనరీ’ మూవీలో నుస్రత్ నటిస్తోంది. కథంతా ఆమె చుట్టూనే తిరిగే ఈ చిత్రంలో రోజురోజుకూ కనుమరుగువుతున్న మానవ సంబంధాలను చూపుతున్నారట. ఇది సందేశాత్మక చిత్రమని చెబుతున్నారు. ప్రముఖ బంగ్లాదేశీ నటుడు మొషార్రఫ్‌ కరీమ్‌ కూడా ఇందులో నటిస్తున్నాడు. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వెళ్లి బస చక్కని నటుడు కూడా. 30 చిత్రాల్లో నటించిన ఆయన 2010లో ‘తారా’ చిత్రం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు.