పశ్చిమ బెంగాల్‌లో కరోనా విలయం సృష్టిస్తోంది. అక్కడ ఏకంగా మంత్రి సుజిత్ బోస్‌కు వైరస్ సోకింది. ఇటీవల ఆయన అంఫాన్ తుపాను సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అతడు అనారోగ్య బారిన పడటంతో పరీక్షించగా.. వైరస్ లక్షణాలు గుర్తించారు. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. సహాయక చర్యల్లో ఆయనతో పాటు పాల్గొన్నవారు ఎక్కడ వైరస్ సోకుతుందోనని భయపడిపోతున్నారు. ప్రస్తుతం మంత్రిని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా సహాయక చర్యల్లో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్లలో ఆయనతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలే స్వచ్ఛందంగా హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కాగా, ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌లో 4536 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో మాత్రమే ఇద్దరు మంత్రులకు కరోనా సోకగా.. ప్రస్తుతం బెంగాల్‌లో కూడా ప్రజా ప్రతినిధులకు సోకడం కొత్త టెన్షన్ పుట్టించింది.