‘హనుమాన్ చాలీసాకు వెళ్తావా.. చంపేస్తాం’ - MicTv.in - Telugu News
mictv telugu

‘హనుమాన్ చాలీసాకు వెళ్తావా.. చంపేస్తాం’

July 19, 2019

West Bengal.

హనుమాన్ చాలీసాకు వెళ్లిన తనను కొందరు చంపేస్తామని బెదిరిస్తున్నారని బెంగాల్ బీజేపీ నాయకురాలు పోలీసులను ఆశ్రయించారు. హిజబ్ (తలకు చుట్టుకునే వస్త్రం) ధరించి ఎందుకు వెళ్లావని వారు బెదిరిస్తున్నారని.. తనకు, తన బిడ్డకు రక్షణ కల్పించాలని కోరారు.  ఆమె పేరు ఇషత్ జహాన్. ఆమె ఇటీవల హిజబ్ ధరించి హౌరాలో ఓ హనుమాన్ చాలీసా కార్యక్రమానికి హాజరయ్యారు. తాను హిందూమత కార్యక్రమానికి వెళ్లానన్న కారణంతో తన భర్త సోదరుడు, ఇంటి యజమాని తనను తిట్టారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ హౌరాలోని గొలబరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

వందలాది మంది తానుంటున్న ఇంటిమీదరకు వచ్చి తనను బెదిరించారని పేర్కొన్నారు. హిందూ కార్యక్రమానికి హిజబ్ ధరించి హాజరై ముస్లింలను అవమానపరిచావని వాళ్లు దుర్భాషలాడారని ఆమె తెలిపారు. తనకు, తన కుమారుడికి పోలీసులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.