ఆ 8 నగరాల నుంచి విమానాలు రావొద్దు.. బెంగాల్ నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

ఆ 8 నగరాల నుంచి విమానాలు రావొద్దు.. బెంగాల్ నిర్ణయం

June 30, 2020

bengal

దేశంలో నిత్యం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్త చర్యలు తీసకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రధాన నగరాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆయా నగరాల్లో రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న 8 నగరాల నుంచి తమ రాష్ట్రానికి విమానాలు రాకుండా నిషేధం విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 

 సూరత్, ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్‌పూర్, చెన్నై, ఇండోర్, అహ్మదాబాద్ నగరాల నుంచి బెంగాల్‌కు వచ్చే విమానాలపై జూలై 6 నుంచి రెండు వారాల పాటు నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు కోల్‌కతా, బగ్దోగ్రా, అండాల్ పట్టణాలకు వచ్చే విమానాల సంఖ్యను నియంత్రించాలని స్పష్టంచేసింది. ఒక్కో ఎయిర్‌లైన్స్ నుంచి వారానికి కేవలం ఒక్క విమానమే సదరు సిటీలకు వచ్చేలా చూడాలని, ఈ మేరకు నిబంధనలు విధించాలని విన్నవించింది.