అప్పారావు మర్మాంగం కోసి చంపేసిన భార్య
మరో పనేమీ లేనట్టు తనను వేధించడమే పనిగా పెట్టుకున్న భర్తను ఓ ఇల్లాలు అత్యంత దారుణంగా చంపేసింది. నిద్రిస్తున్న అతని మర్మాంగం కోసి పరారైంది. తీవ్ర రక్తస్రావంతో అతడు ప్రాణాలు వదిలాడు. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారి గూడెం గ్రామంలో ఈ దారుణం జరిగింది. అప్పారావు, లక్ష్మీ అనే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బంధువులు సర్ది చెబుతున్నా ఫలితం లేకపోయింది.
లాక్‌డౌన్ కూడా తోడు కావడంతో మరింత అల్లరి పడేవారు. అప్పారావు తనకు డబ్బులు కావాలనే వేధించేవాడు. దీంతో లక్ష్మి పథకం ప్రకారం.. గత రాత్రి నిద్రపోతున్న భర్తను మంచానికి కట్టేసింది . కొడవలితో మర్మాంగాలు కోసి పరారైంది. అప్పారావు నరకయాతనతో కేకేలు వేయగా చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. రక్తస్రావంతో అతడు అక్కడికకట్టే చనిపోయింది. పోలీసులు లక్ష్మిపై కేసు నమోదు చేసుకుని ఆమె కోసం గాలిస్తున్నారు.