పశ్చిమ గోదావరి వాగులోపడి ఆరుగురు విద్యార్థులు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పశ్చిమ గోదావరి వాగులోపడి ఆరుగురు విద్యార్థులు మృతి

October 28, 2020

West Godavari Students in Flood Water .jp

పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేలేరుపాడు మండలం భూదేవిపేట గ్రామంలో ఆరుగురు విద్యార్థులు వాగులో పడి చనిపోయారు. స్నేహితులతో కలిసి వన భోజనాలకు వెళ్లి వాగులో దిగి గల్లంతు అయ్యారు. దీంతో వెంటనే స్థానికులు వారి మృతదేహాలను వెలికి తీసి ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన చిన్నారుల కుటుంబాల్లో విషాదం నింపింది. 

వసంతవాడ సమీపంలోని పెదవాగు ప్రాంతంలోకి బుధవారం ఇది జరిగింది. దేవి నవరాత్రులు ముగిసిన తర్వాత స్నేహితులు అంతా కలిసి వనభోజనాల కోసం వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు అంతా వాగులో దిగారు. అదే సమయంలో ప్రవాహం దాటికి విద్యార్థులు గల్లంతు అయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో వారిని వెలికి తీశారు. మృతులు  గొట్టుపర్తి మనోజ్‌(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్‌(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్‌ వెంకట్‌(17), చల్లా భువన్‌(18)గా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.