కరోనా టైంలో తొలి టెస్ట్..ఎవరు గెలిచారంటే! - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా టైంలో తొలి టెస్ట్..ఎవరు గెలిచారంటే!

July 13, 2020

nn g

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇన్ని రోజులు క్రికెట్ మ్యాచ్ లు రద్దైన సంగతి తెల్సిందే. తాజగా దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వెస్టిండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య సౌతాంప్టన్‌లో తొలి టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఘనవిజయం సాధించింది. చివరి రోజు 200 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకున్న విండీస్ జట్టు ఆ తర్వాత నిలకడగా ఆడి మూడు టెస్టుల సిరీస్‌లో తొలి విజయం సాధించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 204 పరుగులకే ఆలౌట్ కాగా, ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 318 పరుగులు చేసి 114 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 313 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 200 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 64.2 ఓవర్లలోనే 200 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో విండీస్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లు పడగొట్టి వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన షానాన్ గాబ్రియెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.