మయాంక్, విరాట్ దూకుడు.. తొలి రోజు భారత్ స్కోర్.. - MicTv.in - Telugu News
mictv telugu

మయాంక్, విరాట్ దూకుడు.. తొలి రోజు భారత్ స్కోర్..

August 31, 2019

West Indies India.

కింగ్స్‌టన్  సబీనా పార్క్ వేదికగా జరుగుతున్న భారత్ – వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు భారత టాప్‌ ఆర్డర్ కుప్పకూలింది. ఆట ముగిసే సమయానికి 264 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, కెప్టెన్ విరాట్ కొహ్లీ కాస్త దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 

టాస్ గెలిచిన విండీస్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. పిచ్‌పై ఉన్న తేమ కారణంగా బౌలింగ్‌తో భారత్‌ను కట్టడి చేయాలని టేలెండర్లు భావించారు. అందుకు తగ్గట్టుగానే  విండీస్ బౌలర్లు భారత్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. లోకేశ్ రాహుల్ (13) పరుగులు చేయగా, చటేశ్వర్ పుజారా (6) పరుగులకే ఔటయ్యాడు. అయితే ఓపెనర్ మాయాంక్ మాత్రం నిలకడగా ఆడి (55) పరుగులు చేయగా, విరాట్ కొహ్లీ (76) పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి విహారి,రిషభ్ పంత్ క్రీజులో ఉన్నారు.