వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ రూ.75 లక్షలు.. - MicTv.in - Telugu News
mictv telugu

వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ రూ.75 లక్షలు..

October 22, 2018

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో హైదరాబాద్‌లో పోలీసులు నగరంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతోంది. సోమవారం నగరంలో నిర్వహించిన వెర్వేరు తనిఖీల్లో  రూ. 75 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో వెస్ట్ జోన్ పోలీసులు తనిఖీ దొరికిన నగదును సీజ్ చేశారు.

Hyderabad West Zone Police Checking Vehicles Due To Election Code 75 lakhs

షయనత్ గంజ్ ప్రాంతంలో పవన్ వ్యాస్ అనే వ్యక్తి నుంచి రూ. 60లక్షలు, జూబ్లీహిల్స్‌లో రామచందర్ రావు అనే వ్యక్తి దగ్గర రూ.5లక్షలు, బ్రిజేష్ తివారీ అనే వ్యక్తి నుంచి రూ. 10 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకుని ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి డబ్బు ఎక్కడు నుంచి వచ్చింది, ఎవరూ ఇచ్చారు అని విచారణ చేపట్టారు.