Whammo: Police station in the guest house itself..after 8 months
mictv telugu

వామ్మో: గెస్ట్ హౌస్‌లోనే పోలీస్ స్టేషన్..8 నెలల తర్వాత

August 19, 2022

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రబుద్ధుడు చేసిన పని అందరినీ ఆశ్చార్యానికి గురిచేస్తుంది. పోలీసు ఉద్యోగాల పేరిట అమాయకుల వద్ద లక్షలకు లక్షలు వసూలు చేసి, తన గెస్ట్‌హౌస్‌లోనే ఓ నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. అంతేకాదు, నకిలీ పోలీస్ యూనిఫాంలను రెడీ చేయించి, పలువురిని పనిలో పెట్టుకొని, వారి ద్వారా పలువురిని బెదిరించి వేలకు వేల వసూళ్లకు పాల్పడ్డాడు. చివరికి అసలు విషయం బయటపడి పరారయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రంలోని బాంకా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రధాన నిందితుడు భోలా యాదవ్..అతడి గెస్టహౌస్‌లో నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. రూ.వేలకు వేలు వసూలు చేసి అనిత, జూలీ అనే ఇద్దరు మహిళల్ని పోలీసులుగా నియమించకున్నాడు. మరో ముగ్గురిని అతడి ముఠాలో కలుపుకొని, వారికి డీఎస్పీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ లాంటి హోదాలు కట్టబెట్టాడు. వారికి యూనిఫాంలతోపాటు, నాటు తుపాకీలు ఇచ్చాడు. వారు చెకింగ్ పేరుతో భయపెట్టి డబ్బు గుంజేవారు. ఇలా ఎనిమిది నెలలపాటు ఈ వ్యవహారం నడిపించాడు. ఈ నకిలీ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే అసలు టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. బుధవారం సాయంత్రం టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన శంభు యాదవ్ నాటు తుపాకులతో ఉన్న నకిలీ పోలీసులను చూశాడు. అతడికి అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటపడడంతో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నాం. త్వరలోనే పట్టుకొని, అన్నీ వివరాలను వెల్లడిస్తాం” అని వెల్లడించారు.

ఈ ఘటనతో బీహార్‌లోని ఉన్నతా పోలీసుశాఖ అధికారులు అప్రమత్తమైయ్యారు. ఇలాంటి నకిలీ పోలీస్ స్టేషన్లు ఎక్కడైనా ఉన్నాయని వేటను షురూ చేశారు. మరోపక్క ప్రధాని నిందితుడి కోసం గాలింపులు చేస్తున్నారు. నిందితుడు ఏఏ నేరాలకు పాల్పడ్డారు? ఎవరని నుంచి ఎంత డబ్బు వసూలు చేశాడు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.