నేరేడు పళ్లు తింటే లాభాలెన్నో.. - MicTv.in - Telugu News
mictv telugu

నేరేడు పళ్లు తింటే లాభాలెన్నో..

June 25, 2022

What are the benefits of eating apricot.........

నేరేడు పళ్ల పేరు ఎత్తగానే నోట్లో నీళ్లూరుతాయి. నలుపు, పర్పుల్ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా వుంటాయి పళ్లు. ఈ చెట్టు ఆకుల నుంచి కూడా మంచి సువాసన వస్తుంది. పులుపు, వగరు, తీపి కలగలసిన రుచి ఈ పండు సొంతం. వేసవికాలంలో ఎక్కువగా లభించే ఈ పళ్లు జులై వరకు దొరుకుతాయి. ఔషధ గుణాలు ఈ పండులో మెండుగా వున్నాయి. దీనిని ఆయుర్వేదంలో ఔషధ ఫలంగా అభివర్ణిస్తారు. ఇది తినడం వల్ల చాలా లాభాలు వున్నాయి. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం కలిగించి ఒంటికి చలువ చేస్తుంది. పేగుల్లో ఉండే వెంట్రుకలను సైతం శరీరం నుంచి బయటకు పంపించే శక్తి అల్లనేరేడుకు ఉంది. జీర్ణశక్తిని వృద్థి చేసి ఆకలిని పెంచుతుంది. పైత్యాన్ని విరోచనాలను తగ్గిస్తుంది. సీజన్‌లో ప్రతి రోజు 10 నుంచి 20 నేరేడు పళ్లను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 

నేరేడుతో ఉపయోగాలు… 

 

నేరేడు రసంలో కొంచెం చెక్కర కలిపి తాగితే నీళ్ల విరేచనాలు తగ్గిపోతాయి.

 

వేసవిలో అతి దాహన్ని అరికడుతుంది. ఒంటికి చలువనిస్తుంది ఈ ఫలం.

 

కడుపులో నులి పురుగులను నివారిస్తుంది. నోటి, మూత్రాశయ క్యాన్సర్‌కు టానిక్‌లా పని చేస్తుంది.

 

కాలేయానికి ఈ పండు ఎంతో మేలు చేస్తుంది.

 

మూత్రం రాక ఇబ్బంది పడేవారు ఈ పండు తినాలి. కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. చిన్న చిన్న రాళ్లను సైతం కరిగిస్తుంది.

 

చిగుళ్ళ వ్యాధులతో బాద పడేవారు ఈ చెట్టు బెరడు, ఆకులు రసాన్ని పుక్కిలిస్తే చాలా మంచిది.

 

నేరేడు విత్తనాలు ఎండబెట్టి చూర్ణం చేసి తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులోకి వస్తుంది.

 

లేత ఆకులతో కషాయం కాసి రోజుకు మూడు సార్లు నాలుగైదు టేబుల్‌ స్పూన్లు తాగితే డయేరియా, మొలలు తగ్గుతాయి.

 

కడుపులో ప్రమాదవశాత్తు చేరుకున్న తల వెంట్రుకలు, లోహపు ముక్కలను సైతం కరిగిస్తుంది.

 

చిగుళ్ళు నుంచి రక్తస్రావం తగ్తుతుంది. నోటి దుర్వాసన దూరమవుతుంది.

 

పండ్లే కాదు నేరేడు ఆకును గాయంపై కట్టుగా కట్టవచ్చు.

 

అల్లనేరేడు పంచదారకు బదులు తెనే కలిపి తాగితే అరికాళ్లు, అరి చేతులు మంటలు, కళ్లు మంటలు తగ్గుతాయి.

 

నేరేడు పుల్లతో దంతాలు తోముకుంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.