సజ్జలు…ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ప్రతిరోజూ సజ్జలు తినడం వల్ల అధికబరువును తగ్గించుకోవచ్చు. చలికాలంలో సజ్జలతో చేసిన రోటీలు ఇష్టంగా తింటుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ సజ్జలు తినడంవల్ల మెటబాలిజం మెరుగుపడి ఊబకాయం తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటన్నింటితోపాటు ఐరన్, జింక్, విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ బి9 పుష్కలంగా ఉన్నాయి. వీటితోపాటు మిల్లెట్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సజ్జల రోటితింటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
గుండెసంబంధిత సమస్యలకు:
నేటికాలంలో చిన్న వయస్సులోనే గుండెసంబంధిత వ్యాధుల బారినపడుతున్నారు. అలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు శీతాకాలంలో సజ్జలతో తయారు చేసిన రోటీలను తిన్నట్లయితే..గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
షుగర్ నియంత్రణలో :
మధుమేహవ్యాధిగ్రస్తులు మిల్లెట్స్ బ్రెడ్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగించే ఫైబర్ ఇందులో ఉంది. షుగర్ తో బాధపడుతున్నవారు ప్రతిరోజూ సజ్జలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
అధికరక్తపోటును నియంత్రిస్తాయి:
మీరు హైపర్టెన్షన్ బాధితులైతే…క్రమం తప్పకుండా సజ్జలను ఆహారంలో చేర్చుకోండి. సజ్జలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెరను నియంత్రించడానికి పనిచేస్తుంది. గోధుమలకు బదులుగా సజ్జలను తీసుకోండి.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి:
మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే మిల్లెట్స్ ను ఆహారంలో చేర్చుకోండి.
ఇన్ఫెక్షన్ రాకుండా :
మీరు ప్రతిరోజూ మిల్లెట్ బ్రెడ్ తినడం ప్రారంభిస్తే…మీరు సీజన్ల్ గా వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుంచి బయటపడతార. సజ్జతో తయారు చేసిన రోటీలు తిన్నట్లయితే శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జలుబు, అలర్జీ వంటి సమస్యలు రావు.