ఏంటి బాబూ? ‘పద్మశ్రీ’ఇవ్వాలా?: విజయ సాయిరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

ఏంటి బాబూ? ‘పద్మశ్రీ’ఇవ్వాలా?: విజయ సాయిరెడ్డి

May 11, 2022

”పేపర్ల లీకును ‘సేవ’గా గుర్తించి, పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? నీ అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి, లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు?” అంటూ వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. ర్యాంకుల కోసం రేయింబవళ్లు నారాయణ యాజమాన్యం పెట్టే ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల ఆక్రందనలు మీకూ వినపడటం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

 

ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదోవ తరగతి ప్రశ్న పత్రాల లీక్ అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ పేపర్ల లీకేజీ విషయంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేతను పోలీసులు అరెస్ట్‌ చేసి చిత్తూరుకు తరలించారు. ఈ క్రమంలో చంద్రబాబు స్పందిస్తూ, నారాయణ అరెస్ట్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ, బుధవారం విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇందుకేనా నారాయణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టారంటూ మండిపడ్డారు. టెన్త్ పేపర్ లీక్ కేసులో చిత్తూరు మేజిస్ట్రిట్ నారాయణకు బెయిల్‌ విడుదల సంగతి తెలిసిందే.