ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కు చట్టాల గురించి ఏం తెలుసు అంటూ నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. గురువారం ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు కోర్టులపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. ”మూడు రాజధానుల విషయంలో శాసనసభకు అధికారం లేదని కోర్టే చెప్పింది. రాష్ట్ర విభజన పార్లమెంటు చట్టం ద్వారా జరిగింది. పార్లమెంటు చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించటం సరికాదు” అని లోకేష్ అన్నారు.
అంతేకాకుండా జగన్కు చట్టాల గురించి ఏం తెలుస్తుంది. కోర్టు వద్దని చెప్పినా వైసీపీ ప్రభుత్వం మూర్ఖంగా మూడు రాజధానుల విషయంలో వ్యవహరిస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి మూడు రాజధానులు కావాలనుకుంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలను, 175 జిల్లాలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ కేబినెట్లో 90 శాతం టెన్త్ ఫెయిల్ అయిన బ్యాచ్ ఉందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అసలు ఏం చదువుకున్నాడో తెలియని జగన్కు చట్టాల గురించి ఏం తెలుస్తుందంటూ లోకేష్ సైటర్లు వేశారు.