మీ నాలుక రంగు మీ ఆరోగ్యాన్ని గురించి చెబుతుంది తెలుసా? మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే మీ నాలుక రంగు కూడా మారిపోతుంది. అవును మీరు చదువుతున్నది నిజం.
కొలెస్ట్రాల్ కు.. గుండెకు ఒక అవినాభావ సంబంధం ఉంది. అదెలా ఉంటుందంటే లవ్-హేట్ రిలేషన్ షిప్ లా ఉంటుందన్నమాట. ఒక వైపు ఇది బలమైన కణ త్వచాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు ధమనులు మూసుకుపోతుంటాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం మనల్ని నిశ్శబ్దంగా పలుకరిస్తుంది.
అధిక కొవ్వు ఉంటే..
అధిక కొవ్వు అనేది చాప కింద నీరులా వస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు మన శరీరం అందివ్వకపోవచ్చు. కానీ నాలుక రంగుతో దీన్ని మనం గుర్తించవచ్చంటున్నారు డాక్టర్లు. మెడికల్ జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్ ప్రకారం.. ముదురు ఊదారంగులో నాలుక ఉంటే కనుక శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఉన్నట్టు భావించాలి. ముదురు ఎరుపు లేదా నీలిరంగు పెదవులు.. మనకు గుండెపోటు ప్రమాదం త్వరలో వస్తుందని ఊహించవచ్చు అంటున్నారు. నాలుక ఊదారంగులోకి వస్తే మాత్రం అస్సలు ఆలస్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ వల్ల..
కొలెస్ట్రాల్ రక్తంలోని వ్యాక్సీ సబ్ స్టాన్స్ ని సూచిస్తుంది. ఇది రెండు రకాలు.. తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్లు (ఎల్డీఎల్), అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్లు (హెచ్ డీఎల్). మొదటిది చెడు కొలెస్ట్రాల్, రెండవది మంచి కొలెస్ట్రాల్. రెండవది కూడా ఆరోగ్యకరమైన హృదయానికి తక్కువ పరిమాణంలో మాత్రమే అవసరమవుతుంది. చెడు కొవ్వు మాత్రం రక్తప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాల్లో శరీరం కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందించడంలో ఈ కొవ్వు అడ్డుపడుతుంటుంది. దీనివల్ల ధమనుల్లో ఈ కొవ్వు చేరి రక్తానికి అడ్డుకట్ట వేస్తుంది.
ఊదా రంగులోనే..
నాలుక ఊదారంగు మారితే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనే భావన ఉంది. అంతేకాదు.. అథెరోస్క్లెరోసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఓరల్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రకారం.. కొన్ని కణితులు ఉన్న కూడా నాలుక ఊదారంగులోకి మారవచ్చు. ఇది నోటి క్యాన్సర్ అయినా కావచ్చు. నీలిరంగుతో కలిసి ఉంటే.. అది విటమిన్ లోపం లేదా అడ్రినల్ గ్రంథుల రుగ్మతగా భావించాలి.