డార్లింగ్ ప్రభాస్ ఉప్పలపాటికి అనారోగ్యంగా ఉందని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లాడని కొన్ని రోజులుగా పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇప్పట్లో సినిమాలు కష్టమనీ ఏవేవో రాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక వార్త కమ్ ఫోటో భయంకరంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ చూడ్డానికి ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా, వికారంగా ఉండడమే దీనికి కారణం. పైగా తమిళ్ తలైవా రజనీకాంత్ పక్క నిల్చుని కనిపించాడు. బానపొట్టతో చాలా లావుగా, ముఖమంతా ఉబ్బి మహా దారుణంగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో చూసి బాహుబలి అభిమానులు షాక్ అవుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ‘మనోడు ఏంటిలా అయిపోయాడు? సినిమాలు ఆడకపోతే మాత్రం ఇలా దిగులు పెట్టుకుని ఏది బడితే అది తినేస్తే లావుకాకుండా స్లిమ్‌గా ఉంటాడా?, మారథాన్ కు పంపాల్సిందే’ అని కామెంట్లు పెడుతున్నారు.
కొందరు ఇది ఫేక్ ఫోటో అని కొట్టిపారేస్తున్నారు. విషయాన్ని ఆరా తీస్తే వాళ్లన్నదే నిజమని తేలింది. మరి రజనీ పక్కన ఉన్న ఆ లావు పీసు ఎవరని కదా మీ సందేహం? ఆ పీస్ ఫోటో మార్ఫింగే. ప్రముఖ దర్శకుడు రాజేశ్ భట్ బాడీకి డార్లింగ్ ముఖాన్ని అతకబెట్టి ఇలా తీర్చిదిద్దారు ఫొటోషాప్ కళాకార్స్. ‘జైలర్’ అనే కన్నడ మూవీ కోసం రాజేశ్ భట్, దర్శకుడు శివ నాగరాజ్‌లు చెన్నెలో రజనీని కలుసుకున్నప్పుడు తీసిన ఫోటోను ఇలా వా(ఆ)డేసుకున్నారు.
What happened to #Prabhas𓃵 ? He's looking horrible here 😰 pic.twitter.com/nnJYqDN3Jo
— Cinema Diary (@Cine__Diary) March 15, 2023
కారణం అదేనా…
ఈ ఫోటో మార్ఫింగ్ వెనక అల్లు అర్జున్ అభిమానుల హస్తం ఉందని అని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా హీరో కావడం తెలిసిందే. సాహో, రాధేశ్యాం, సలార్ ఆదిపురుష్ వంటి మెగాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. కొన్ని హిట్ కాకపోయినా ప్రభాస్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తెలిసిపోయాడు. బన్నీ కూడా పుష్ప మూవీతో ఇంచుమించు అదే లెవల్ చేరుకున్నాడు. పాన్ ఇండియా ఇమేజీపై ఈ ఇద్దరు హీరోల మధ్య నిజంగానే అసూయ వంటివి ఉన్నాయో లేవో తెలియకపోయినా ఇద్దరి అభిమానులు మాత్రం నిత్యం గొడవ పడుతుంటారు. ఓ ప్రెస్ మీట్లో పుష్ప గురించి ప్రభాస్ మొహమానికి మెచ్చుకున్నాడని, తమ హీరోను పొగడలేదని బన్నీ అభిమానులు హర్ట్ అయ్యారు. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ మూవీలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, ఇప్పుడు బన్నీనే పాన్ ఇండియా హీరో అని ఎదరుదాడికి దిగుతున్నారు. డార్లింగ్ అభిమానులు కూడా తక్కువ తినకుండా, బన్నీ ప్రభాస్ ముందు బచ్చా అని కరివేపాకులా తీసేస్తుంటారు. ప్రభాస్ చికిత్సకు వెళ్లాడన్న వార్తలు, పైన చెప్పుకున్న ఫోటో వంటి మార్ఫింగ్ తతంగాలు ఇలాంటి అసూయా ద్వేషాల నుంచే పుట్టుకొచ్చినట్లు భావించాలి.
ప్రభాస్‌పై నిజానికి బురద చల్లుతున్నది బన్నీ ఫ్యాస్ కాదని, దీని వెనక బాలీవుడ్ కుట్ర ఉందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ మరిన్ని భారీ ప్రాజెక్టులతో బాలీవుడ్‌లోకి ఎంటరైతే తమకు ముప్పని భావించిన అక్కడి హీరోలు, సినీ మాఫియా ఉద్దేశపూర్వకంగా అతనికి వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రభాస్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్త మొదట ఉత్తరాది, హిందీ మీడియాలోనే వస్తున్నాయని అతని ఫ్యాన్స్ చెబుతున్నారు. లైగర్‌తో బాలీవుడ్‌లోకి ఎంటరైన విజయ్ దేవరకొండపై కావాలనే బురదజల్లి పంపారని గుర్తు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ సత్తా ఉన్న నటులందరికీ అవకాశాలు కల్పిస్తుందని, కేజీఎఫ్, కాంతార, కార్తికేయ, పుష్ప, బాహుబలి, ట్రిపులార్ వంటి దక్షణాది మూవీలకు ఉత్తరాది జనం బ్రహ్మరథం పట్టారని బాలీవుడ్ వాదన.