What happens if it rains in the semis?
mictv telugu

సెమీస్‌లో వర్షం పడితే..భారత్ ఫైనల్‌కే

November 8, 2022

What happens if it rains in the semis?

టి20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. టోర్నీలో మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉన్న నాలుగు జట్లలో ఎవరు ఛాంపియన్ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ -1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరితే.. గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు చేరాయి. నవంబర్ 9, 10వ తేదీల్లో సిడ్నీ, అడిలైడ్ వేదికల్లో సెమీఫైనల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 9న సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది.10వ తేదీన అడిలైడ్ వేదికగా భారత్ -ఇంగ్లాండ్ ఢీ కొట్టనున్నాయి.

వరుణుడు ఆడిన ఆట :

ఇక ఈ మెగా టోర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగినా.. పలు మ్యాచ్‌లకు తీవ్ర అంతరాయం కలిగింది. వరుణుడు దెబ్బకు కొన్ని మ్యాచ్ ఫలితాలు మారిపోగా..మరికొన్ని మ్యాచ్‌లు పూర్తిగా రద్దయ్యాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు సెమీస్‌లో కూడా వర్షం పడితే పరిస్థితి ఏంటనే సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వర్షం వచ్చే సూచనలు లేకున్నా అట్లాంటి అనుమానాలు మాత్రం తలెత్తుతున్నాయి.

సెమీస్‎లో వర్షం పడితే..

సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్‌డే కేటాయించారు. ఇక రిజర్వ్‌డే కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే సాధారణ మ్యాచ్‌ల్లో ఐదు ఓవర్ల పాటు ఆట కొనసాగినా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేలుస్తారు. అయితే ఫైనల్లో మాత్రం కచ్చితంగా 10 ఓవర్ల ఆట కొనసాగాలి. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇరు జట్ల కెప్టెన్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సెమీ ఫైనల్ సందర్భంగా ప్రతికూల పరిస్థితుల్లో మ్యాచ్ రోజుతో పాటు రిజర్వ్ డే కూడా 10 ఓవర్ల ఆట కొనసాగకపోతే.. పాయింట్స్ టేబుల్‌లో మెరుగ్గా ఉన్న జట్టు ఫైనల్ చేరుతోంది.

భారత్ ఫైనల్‎కే..

వర్షం పడి సెమీస్ మ్యాచ్ క్యాన్సిల్ అయితే భారత్ ఫైనల్‌కు దూసుకుపోతుంది. గ్రూప్ -2 టాప్ లో ఉన్న ఇండియా, గ్రూప్ -1 టాప్ లో ఉన్న న్యూజిలాండ్,
ఫైనల్‌కు పోతాయి. పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఫైనల్లోనే ఈ పరిస్థితి తలెత్తి 10 ఓవర్ల ఆట కూడా కొనసాగకపోతే.. టైటిల్ ఇరు జట్లు షేర్ చేసుకుంటాయి.