కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక ఏం జరుగుతుంది? - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక ఏం జరుగుతుంది?

March 15, 2020

What happens when corona virus enters human body

ప్రపంచాన్ని భయంకర కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కూడా ఇంకా తయారు కాకపోవడంతో ప్రజల్లో భయం రెట్టింపు అయింది. దీంతో ప్రభుత్వాలు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాన్సెట్ జర్నల్‌లో ఓ ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందులో కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి ఎటువంటి మార్పులు కనిపిస్తాయో వివరించారు. 

ఈ వైరస్ సోకిన తరువాత మొదటి ఐదు రోజులూ ఎటువంటి లక్షణాలూ బయటపడవు. కొందరిలో 14 రోజుల పాటు ఏ మార్పులూ ఉండవు. ఒకసారి వైరస్ ప్రభావం కనిపించడం మొదలైన తరువాత… తొలి మూడు రోజులు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తరువాత గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తాయి. 80 శాతం మంది కరోనా వైరస్ సోకిన వారిలో తొలుత ఈ లక్షణాలే కనిపించాయి. నాలుగో రోజు నుంచి తొమ్మిదో రోజులోగా, వైరస్‌ ప్రభావం ఊపిరితిత్తులపై పడి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. జ్వరం కూడా పెరుగుతుంది. ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో పాటు గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా వస్తాయి. పదిహేనవ రోజు వచ్చేసరికి ఊపిరితిత్తుల్లోని ఇన్‌‌ఫెక్షన్‌ రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఆ స్థితికి బాధితుడు చేరుకుంటే, తదుపరి రెండు వారాల పాటు అత్యంత కీలకం. అతని ప్రాణాలను కాపాడుకోవాలంటే, ప్రత్యేక వైద్యం, ఇంటెన్సివ్‌ కేర్‌ చికిత్స తప్పనిసరి.