నీ కూతురిపై లైంగికదాడి జరుగుంటే.. అమితాబ్ భార్యపై కంగన ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

నీ కూతురిపై లైంగికదాడి జరుగుంటే.. అమితాబ్ భార్యపై కంగన ఫైర్

September 15, 2020

What if it was Shweta or Abhishek: Kangana Ranaut asks Jaya Bachchan after attack on gutter remark

అటు సినిమాలు ఇటు సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ.. ఘాటు వ్యాఖ్యలతో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ వివాదాల తారగా మారారు. సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఆమె బాలీవుడ్ మీద, మహారాష్ట్ర ప్రభుత్వం మీద తరచూ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె సీనియర్ నటి, ఎంపీ జయా బచ్చన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘డ్రగ్స్‌ విషయంలో సినీ పరిశ్రమపై నిందలు వేస్తున్నారు. సొంత పరిశ్రమకే ద్రోహం చేస్తున్నారు. ఆ రంగానికి ప్రభుత్వ మద్దతు కావాలి’ అని రాజ్యసభలో ఈ రోజు ఎంపీ జయాబచ్చన్ కోరిన సంగతి తెలిసిందే. 

ఆమె వ్యాఖ్యలపై కంగన కౌంటర్ ఇచ్చారు. ‘జయాజీ.. నా స్థానంలో మీ కూతురు శ్వేత, సుశాంత్ స్థానంలో మీ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ ఉంటే కూడా మీరు ఇలాగే మాట్లాడేవారా? మీ కూతురు శ్వేత టీనేజ్‌లో నాలాగా బాలీవుడ్‌లో దెబ్బలు తిని, డ్రగ్స్‌కు అలవాటుపడి, లైంగిక వేధింపులకు గురైతే ఈ విధంగానే మాట్లాడతారా? సుశాంత్ సింగ్‌లా మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ తరుచూ వేధింపుల గురించి ఫిర్యాదు చేసి, చివరకు ఆత్మహత్య చేసుకుంటే మీ వైఖరి ఇలాగే ఉంటుందా? మాలాంటివారిపై కాస్త దయ చూపండి’ అని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. కాగా, బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో కొత్తగా డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. మరోవైపు బాలీవుడ్‌లో డ్రగ్స్‌ గురించి ఇటీవల కంగన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నటిని కావాలనే ఆసక్తితో తాను టీనేజీలో ఇంటి నుంచి పారిపోయి ముంబైకి వచ్చానని.. వచ్చి డ్రగ్స్‌కి అలవాటు పడ్డానని కంగన వ్యాఖ్యానించింది. చాలా మంది చెడ్డవారి చేతుల్లో తాను ఇబ్బందులు పడ్డానని వీడియోలో తెలిపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.