సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాటలు విని ఉత్తర ప్రదేశ్ పోలీసులను అవాక్కయ్యేలా చేశాయి. పార్టీ నేత అరెస్టును నిరసిస్తూ.. ఆదివారం లఖ్‌నవూలో ఆందోళనకు దిగారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మర్యాదపూర్వకంగా తేనీరు (టీ) ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ టీ ని తాగేందుకు ఆయన నిరాకరించారు. చాయ్ పేరుతో విషం ఇస్తే? అంటూ ప్రశ్నించారు. తన వెంట వచ్చిన తన పార్టీ కార్యకర్తల్లో ఒకరిని పిలిచి, బయట నుంచి ఓ టీని తీసుకురావాలని కోరారు. పోలీసులకు ఆయన చెప్పిన సమాధానం విని మైండ్ బ్లాంక్ అయింది. ఏం చెబుతున్నారో.. ఎవరిని అంటున్నారో.. తెలియక షాక్‌లో ఉండిపోయారు.
సోషల్‌మీడియాలో అసభ్యకరమైన, అవమానకరమైన పోస్టులు చేశారనే ఆరోపణలతో.. సమాజ్‌వాదీ పార్టీ ఆఫీస్ బేరర్ మనీశ్ జగన్ అగర్వాల్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అగర్వాల్ అరెస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలేశ్ యాదవ్.. తన కార్యకర్తలతో పోలీసు హెడ్ క్వార్టర్స్‌కి వెళ్లారు. అక్కడ సిబ్బంది అఖిలేశ్‌కు టీ అందించగా.. “ఇక్కడి టీ నేను తాగను.. బయటి నుంచి తెచ్చిన టీ తాగుతాను.. విషం కలిపితే ఎలా?” అని దాన్ని తిరస్కరించారు. అంతేకాకుండా.. హెడ్ క్వార్టర్స్ లోపల ఏ సీనియర్ అధికారి లేరని, ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే.. మరి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోండని అఖిలేశ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ ప్రశాంత్ కుమార్ స్పందించారు. “ఆదివారం కావడం వల్ల అధికారులు అవసరాన్ని బట్టి హాజరయ్యారని చెప్పారు.