what is dhamaka movie result
mictv telugu

ధమాకా సీన్ రివర్స్ ?

December 25, 2022

what is dhamaka movie result

అదరగొట్టిన పబ్లిసిటీ.. భారీ అంచనాలు.. సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్నింటికీ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్. ఇంకేంటి మాస్ మహారాజాకి ఇన్నాళ్లకు హిట్ పక్కా అనుకున్నారంతా. కట్ చేస్తే సీన్ రివర్స్ అయిందని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. లాజిక్ లేని కథాంశాలకి ఎప్పుడో కాలం చెల్లిపోయిందని.. కరోనా తరువాత ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయిందని.. ఓటీటీ జమానాలో ఇంకా ఈ మూస కథలేంటీ రవితేజ అంటూ అభిమానులే పెదవి విరుస్తున్నారు. ఎంత కామెడీ చిత్రమైతే మాత్రం కనెక్ట్ అవ్వడానికి ఒక్క లాజిక్ అయినా ఉండాలి కదా అని ధమాకా మూవీపై ఊహించని విమర్శలు వస్తున్నాయి. అయితే ధమాకా స్టోరీ ఇప్పటిది కాదంట. కొన్నేళ్ల క్రితం రచయిత ప్రసన్న కుమార్ ఈ కథని పట్టుకుని చాలా మంది హీరోల దెగ్గరికి తిరిగాడట. ఒకసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఈ కథని న్యారేట్ చేశాడట ప్రసన్న కుమార్. కానీ నిమిషం ఆలోచించకుండా స్టోరీని రిజెక్ట్ చేశాడట చెర్రీ. ఆ తరువాత అథే కథతో చాలామంది హీరోల దెగ్గర తిరిగినా రవితేజ దెగ్గర మాత్రం ప్రసన్న కుమార్ కి పని అయిపోయింది.

ఇక సినిమాని రవితేజ ఎందుకు ఒప్పుకున్నాడో కానీ ధమాకాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అడ్డంగా బుక్ అయ్యాడని అంటున్నారు. రిలీజ్ కి ముందు వచ్చిన ట్రెమండస్ హైప్ భారీ ఓపెనింగ్స్ ని తీసుకొచ్చినా వీకెండ్ లో ధమాకా సీన్ రివర్స్ అయిపోయిందని.. మూస కథ కావటంతో థియేటర్స్ కాలి అయిపోతున్నాయని.. సోమవారం నుండి సినిమా అస్సామే అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ‘ధమాకా’ మూవీ కథ విషయానికొస్తే.. ఒక మిడిల్ క్లాస్, రిచ్ ఫ్యామిలీకి చెందిన రెండు ఇళ్లల్లో ఒక్కడే కొడుకుగా జీవిస్తాడనే మెయిన్ పాయింట్ అంత నమ్మశక్యంగా లేదు. ఎంత కామెడీ సినిమా అయినా ఇంతలా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే తిరస్కరణకు గురికాక తప్పదు. అయితే ఈ పాయింట్స్ అన్నిటినీ కామెడీతో కప్పేయొచ్చని మేకర్స్ భావించి ఉంటారు. కానీ ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్ మారింది. రియలిస్టిక్ కథలకే పట్టం కడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇంకా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకు లైఫ్ లేదనే విషయాన్ని రైటర్స్, డైరెక్టర్స్ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.

 

‘చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు’- నందమూరి బాలకృష్ణ

సినిమా సెలబ్రిటీల బండారం బయటపెడతా : నటి వార్నింగ్

మారుతి సినిమాలో ప్రభాస్ లుక్ ఇదే… షూటింగ్ ఫోటో లీక్

రాత్రి చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా కన్నుమూశారు.. రవిబాబు

జూ.ఎన్టీఆర్ భావోద్వేగం..లే బాబాయ్ అంటూ… వీడియో‎కాల్ ద్వారా చలపతిరావును చివరిచూపులు

మీ భార్య అమల మమ్మల్ని వేధిస్తుంది.. వీధి కుక్కలని మీ ఇంట్లో వదిలేస్తాం