What Is reasons behind tollywood actress anushka shetty overweight
mictv telugu

అనుష్క వెయిట్ కంట్రోల్ తప్పడానికి కారణాలు ఇవేనా?

March 28, 2023

What Is reasons behind tollywood actress anushka shetty overweight

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి, కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‏కు చేరుకుంది. మొదటి సినిమాలోనే నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది స్వీటీ. మిర్చిలో అమాయకపు పల్లెటూరి అమ్మాయిలా కనిపించి అందరి హృదయాలను దోచేసింది.

అరుంధతిలో తనలోని మరోకోణాన్ని పరిచయం చేసి ఫ్యాన్స్‏ను మంత్రముగ్ధులను చేసింది. బాహుబలిలో యువరాణిలా కనిపించి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. నిశ్శబ్దంలో డఫ్ అండ్ డంబ్‏గా నటించి ఆశ్చర్యపరిచింది. తన కెరీర్‏లో చేసిన ప్రతి సినిమాలో ప్రయోగాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. చివరకు ఆ ప్రయోగమే ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. సైజ్ జీరో కోసం అనుష్క విపరీంతగా బరువు పెరిగింది.

What Is reasons behind tollywood actress anushka shetty overweight

ఆ తరువాత తన జిమ్ వర్కౌట్‏లతో తగ్గుదామని ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కాలేదు. అమ్మడి అందాలు ఏమాత్రం తరగలేదు. అయితే అనుష్క ఇంతలా వెయిట్ కంట్రోల్ తప్పడానికి ఓ కారణం ఉందని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో మరోసారి అనుష్క ఫిట్‏నెస్‏పై నెట్టింట్లో డిస్కషన్ మొదలైంది.

సిల్వర్ స్క్రీన్‏పై మెరిసిన చాలా మంది హీరోయిన్‏లు ఎక్కువగా గ్లామర్ పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంటారు. కానీ కొద్ది మంది మాత్రమే ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు. అందంతో పాటు యాక్టింగ్ తెలిసిన అనుష్కకు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.

ఆమె యాక్టింగ్‏కే కాదు గ్లామర్‏కు ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్‏గా రాణిస్తున్న క్రమంలోనే అనుష్క కె.ప్రకాష్ దర్శకత్వంలో సైజ్ జీరో సినిమాను చేసింది. ఈ సినిమా ముందు వరకు అనుష్క మంచి ఫిట్‏నెస్‏తో ఉండేది. సినిమాలోని పాత్ర డిమాండ్ చేయడంతో అనుష్క బరువుపెరిగింది. అయితే ఆ ప్రయోగం కాస్త బెడిసికొట్టింది. అనుష్క ఒక్కసారిగా ఫిట్‏నెస్ విషయంలో కంట్రోల్ తప్పింది. అంతే కాదు సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

సైజ్ జీరోతో ఒక్కసారిగా బరువు పెరిగిన అనుష్క మళ్లీ ఫిట్ అయ్యేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినా వర్కౌట్ కాలేదు. కానీ ముందే కమిట్ అయిన బాహుబలి 2 లో అనుష్క లావుగానే కనిపించింది ,అయితే రాజమౌళి గ్రాఫిక్స్‏తో మేనేజ్ చేశారు. ఆ తరువాత వచ్చిన భాగమతి, నిశ్శబ్దంలోనూ అనుష్క బొద్దుగానే దర్శనమిచ్చింది.

నిశ్శబ్దం తరువాత అనుష్క చాలా గ్యాప్ తరువాత రీసెంట్‏గా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గ్యాప్‏లో అమ్మడు స్లిమ్ అవ్వడానికి ప్రయత్నించిందని భావించారు. కానీ ఈ మధ్యనే బాగా బొద్దుగా మారిన అనుష్క వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది.

అయితే అనుష్క ఇంతలా వెయిట్ పెరగడానికి థైరాయిడ్ కారణమని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది మాత్రం అనుష్కనే చెప్పాలి. మరికొంత మంది అనుష్కకు అసలు సినిమాలు చేయడం అంటే ఇష్టం లేదని అందుకే ఫిట్‏నెస్‏పై దృష్టి పెట్టడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చాలా రోజుల గ్యాప్ తరువాత అనుష్క యూవీ క్రియేషన్స్‏లో, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసమే మళ్లీ అనుష్క లావు అయ్యిందంటున్నారు. అయితే ఈ మధ్యనే విడుదలైన సినిమా పోస్టర్‏లో మాత్రం అనుష్క నార్మల్ గానే కనిపించింది.

దీంతో రాజమౌళి చేసినట్లుగానే గ్రాఫిక్స్ తో అనుష్క వెయిట్‏ను మేనేజ్ చేసుంటారని టీటౌన్‏లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే స్వీటీ ఫ్యాన్స్ మాత్రం అనుష్క్ ఫిట్‏నెస్‏తో మళ్లీ నార్మల్ లుక్‏లోకి రావాలని కోరుకుంటున్నారు. మరి ఇది నిజం కావాలంటే కాస్త కష్టంతో కూడుకున్నదే .మరి ఏ సినిమా మీద ప్రేమ కోసం అనుష్క లావు అయ్యిందో అదే సినిమా మీద ప్రేమ అనుష్కను స్లిమ్‏గా మార్చేలా చేస్తుందేమో చూడాల్సిందే.