what is the india t20 record against england
mictv telugu

కాసేపట్లో భారత్ vs ఇంగ్లాండ్..

November 10, 2022

టీ 20 వరల్డ్ కప్‎లో మరో హై హోల్టేజ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమవుతోంది. కాసేపట్లో భారత్, ఇంగ్లాడ్ తలపడబోతున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు అడిలైడ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కివీస్‌ను ఓడించి పాక్ ఫైనల్‌‌కు చేరుకోవడంతో ఈ మ్యాచ్‎పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లాండ్‌పై భారత్ విజయం సాధించి తుది పోరుకు రావాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.సూపర్-12 దశలో అన్ని జట్ల కంటే అత్యుత్తమ ప్రదర్శన చేసి టీం ఇండియా సెమీస్కు చేరితే.. అతి కష్టంతో ఇంగ్లాండ్ పైకి వచ్చింది. . ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై ఓడిపోగా.. శ్రీలంకపై అతికష్టం మీద నెగ్గింది. పట్టిమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ -భారత్ మధ్య హోరాహోరీ తప్పకపోవచ్చు.

రికార్డ్స్ ఎవరి వైపు..
పాత రికార్డులను పరిశీలిస్తే ఇంగ్లాండ్‌తో ఇప్పటి వరకు భారత్ 22 టీ20 మ్యాచ్ లు ఆడింది. వీటిలో భారత్..12 మ్యాచ్‌లో గెలవగా 10 మ్యాచ్ ల్లో ఓటమి చవిచూసింది. టీ 20 వరల్డ్ కప్స్‌లో ఇండియా, ఇంగ్లాండ్ 3 సార్లు తలపడ్డాయి. 2007, 2012ల భారత్ విజయం సాధించగా..2009లో ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. టీ 20లో ఆ జట్టుపై 589 పరుగులు సాధించాడు. ఇటీవల ఇంగ్లాండ్, భారత్‌లో జరిగిన టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లను భారత్ కైవసం చేసుకుంది.