కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మరింత ముదిరింది . బెల్గాంలో మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో పర్యటిస్తున్న మహరాష్ట్ర మంత్రులకు సెగ తగిలింది. వీరికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి.మహారాష్ట్ర సరిహద్దులో వాహనాలపై దాడి చేశారు. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ వచ్చిందంటే చాలు రెండు రాష్ట్రాల మధ్య మొదలవుతుంది. ప్రతి ఏడాది ఇలాగే జరగడానికి కారణాలేంటి?దీని వెనుక అసలేం జరిగింది?
పౌరుషం వర్సెస్ ఆత్మగౌరవం
ఒకరిది పౌరుషం..ఇంకొకరిది ఆత్మగౌరవం…వెరసి రెండురాష్ట్రాల మధ్య వివాదం. డిసెంబర్ నెల వచ్చిందంటే సరిహద్దులు సెగలు రేపుతాయి. నిరసనలు మిన్నంటుతాయి. వాగ్వాదాలు ఘర్షణలుగా మారుతాయి. భౌతికదాడులు, వాహనాల ధ్వంసానికి దారితీస్తాయి. మహారాష్ట్ర ప్రభుత్వం శాసనసభ శీతాకాల సమావేశాల్ని బెళగావి జిల్లాలోని సువర్ణ విధాన సౌధలో నిర్వహిస్తుంది. ఇదే గొడవలకు కారణం అవుతుంది. బెల్గావితోపాటు ఒకప్పుడు బోంబాయి రాష్ట్రంలో భాగమైన బీజాపూర్ , ధార్వాడ్ , ఉత్తర కెనరా జిల్లాల్ని 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మైసూర్లో కలవడమే వివాదానికి మూలం.
ప్రభుత్వాలు మారినా…
కొన్నిరోజులపాటు వివాదం కొనసాగుతోంది. తర్వాత ఇరు రాష్ట్రాల ప్రజలు కూల్ అవుతారు.మళ్లీ డిసెంబర్ వచ్చిందంటే గొడవలు మొదలవుతాయి. ఎన్నో ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతుంది. నిరసనల్లో పార్టీలు పాల్గొంటాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారాయి.కానీ వివాదం నడుస్తూనే ఉంది. అసలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
1956 నుంచి…
1956 నుంచి కర్నాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం కొనసాగుతోంది. 1956 తర్వాత ఏర్పడిన గుజరాత్, బొంబాయి రాష్ట్రం నుంచి విడగొట్టి గుజరాత్‌ని 15 రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. బొంబాయి రాష్ట్రం నుంచి ఆ నాలుగు జిల్లాలతోపాటు, ఆంధ్ర రాష్ట్రం నుంచి బళ్లారి, మద్రాసు రాష్ట్రం నుంచి దక్షిణ కెనరా,,హైదరాబాద్ రాష్ట్రం నుంచి కొప్పల్ , రాయచూర్ కలబుర్రి, బీదర్ జిల్లాలను కూర్గు స్టేట్‌ను ఒక జిల్లాగా చేస్తూ..మైసూరు రాష్ట్రంలో కలిపారు. వీటిలో బొంబాయి రాష్ట్రం నుంచి కలిపిన నాలుగు జిల్లాలపైనే ప్రస్తుత మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆ నాలుగు జిల్లాలోని మొత్తం 865 పట్టణాలు, గ్రామాలు తమకే చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోంది. ఫజల్ అలీ కమిషన్ నివేదికను మహారాష్ట్ర ఇప్పటికి ఒప్పుకోకపోవడంతో ఈ వివాదం నడుస్తోంది. కర్ణాటక ఆవిర్భావం నుంచి వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడితే ఎప్పుడో పరిష్కారం అయ్యేది..ఇలా చేయకపోవడమే డిసెంబర్ ఫైట్‌కు కారణమని తెలుస్తోంది.
Karnataka,Maharastra,Border,Dispute,States Organisation Act, 1956
కర్నాటక,మహారాష్ట్ర , సరిహద్దు వివాదం,సీఎం బసవరాజు బొమ్మై, ఏక్ నాథ్ షిండే
Maharashtra-Karnataka border dispute rages on. Watch this report
(@sagayrajp)#5iveLIVE @ShivAroor #news #Belagavi #Karnataka #Maharashtra pic.twitter.com/EnBectqFJi— IndiaToday (@IndiaToday) December 6, 2022